![]() |
![]() |
.webp)
శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయ్యి నాలుగేళ్లు అవుతున్న సందర్భంలో ఈ ఎపిసోడ్ మొత్తం రష్మీ యాంకరింగ్ చేస్తుందా లేదా ? శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ యాంకర్ ఎవరు ? అన్న కాన్సెప్ట్ మీద జరిగింది. ఐతే రష్మీ తప్ప వేరే యాంకర్ వద్దు అంటూ ఆది చెప్పాడు. "యాంకర్ గా రష్మీ చాలా బాగా చేస్తుంది. ఒక కంటెంట్ క్రియేట్ చేయాలన్నా, ఒక జోక్ క్రియేట్ చేయాలన్నా ఎంత కష్టమో రష్మీకి తెలుసు. అందుకే రష్మీ ఎప్పుడూ ఎవరితో కూడా ఈ జోక్ వద్దు ఆ జోక్ వద్దు అంటూ చెప్పదు. ప్రతీ జోక్ ని చాలా ఈజీగా తీసుకుంటుంది. అలాగే చిన్న, పెద్ద ఆర్టిస్ట్ అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా పలకరిస్తుంది.
మా శ్రీదేవి డ్రామా కంపెనీకి రష్మీ వచ్చాక చాలా చాలా కలిసొచ్చింది. ఒక ఇంట్లోకి మహాలక్ష్మి అడుగుపెడితే ఎలా ఉంటుందో..మా సెట్ లోకి రష్మీ అలా అడుగుపెట్టింది. సీరియస్ గా చెప్పాలంటే రష్మీ జోడీగా సుడిగాలి సుధీర్ తో చేసినప్పటి కంటే సోలోగా డీల్ చేసినప్పుడు రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. రష్మీ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. సోలో యాంకరింగ్ లో రష్మీ సూపర్. రష్మీ రిలేటెడ్ కంటెంట్ ఏది చేసినా ఆ రేటింగ్ ఎప్పుడూ మిస్ అవలేదు." అంటూ ఆది రష్మీ గురించి చెప్పేసరికి రష్మీ ఏడుస్తూ "నా గురించి మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్స్. నాకు తెలుసు నేను పర్ఫెక్ట్ కాదు అని..కానీ అందరిలో తప్పులు ఉంటాయి. పర్సనల్ లైఫ్ లో కావొచ్చు, జాబ్ లో కావొచ్చు పర్ఫెక్ట్ నెస్ కోసం ట్రై చేస్తూ ఉంటాము. కానీ అన్నిసార్లు జరగదు" అంటూ చెప్పింది. ఇక ఫైనల్ లో మిగతా యాంకర్స్ అంతా వచ్చి అసలు మేమేదో శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్స్ అవుదామని వస్తే ఇలా చేస్తారా అంటూ సౌమ్య, ఆర్జే కాజల్, మృదుల, నేహా చౌదరి అందరూ అడిగారు. దానికి ఆది ఇలా చెప్పాడు. "మా రష్మీ గొంతు పోయింది కాబట్టి యాంకర్స్ అంతా తలా ఒక మాట మాట్లాడేస్తే ఎపిసోడ్ ఐపోతుంది" అని పిలిచాం అంటూ షాకిచ్చాడు.
![]() |
![]() |